శ్రీమతి సునీల ప్రకాశ్ గారు గురుదేవులు శ్రీ నటరాజ రామకృష్ణ, శ్రీ కళాకృష్ణ శ్రీ ప్రకాశ్ గార్ల వద్ద ఆంధ్రనాట్యం, పేరిణి నాట్యాలలొ శిక్షణపొందారు. వీరు నృత్యంలొ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము నుండి సర్టిఫికెట్, డిప్లామోలను, సెంట్రల్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందారు.
వీరు 2003 నుండి 2016 వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ బ్రాంచ్ నందు డాన్స్ డిప్లార్టుమెంటుకు హెడ్ గా పనిచేశారు. తెలంగాణ ఆవిర్బావము అనంతరము తెలంగాణ ప్రభుత్వపు అన్నమాచార్య సంగీత, నృత్య కళాశాలలో పేరిణి శిక్షకురాలుగా పనిచేస్తూ ఎందరో విద్యార్దులకు ఈ నృత్యరీతులలో శిక్షణనిస్తూన్నారు.
వీరు బారతదేశంలో జరిగిన వివిద నృత్యోరీతులలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకొనుటయ్ కాక నృత్య చూడామణి, నట్య విశారద, కీర్తీ పురస్కార్ వంటి అవార్దులను సొంతం చేసుకున్నారు.
పేరిణి ఆంధ్రనట్యలను అభ్యసించు విద్యార్దులకు ఎంతో ఉపయుక్తంగా ఇంతకు పూర్వం వీరు ఆంధ్రనాట్యం-పేరిణి సిద్దాంతదర్శిని అను పుస్తకాన్ని రచించారు.
తెలంగాణ ఆవిర్బావ అనంతరం వివిధ జిల్లాలలోని పురాతన ఆలయాలలోని నృత్యకారుల, వాద్యకారుల శిల్పాలను ఆధారాలుగా సేకరించి "తెలంగాణ శాస్ర్తీయ నృత్యం పేరిణి" అను పుస్తకాన్ని రచించారు.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంచే ప్రవేశపెట్టిబడిన పేరిణి సర్టిఫికేట్ కోర్స్ ను అభ్యసించు విద్యార్దులకు ఉపయుక్తంగా సిద్దాంత, ప్రాయేగికాలపై తమకు గల అనుభవాని జోడించి ఈ పుస్తకాన్ని రచించారు.
గురుదేవుల ఆశీస్సులతో సాగిన వీరి రచనలు పేరిణి ఆంధ్రనట్యం రీతులపై పాఠకులకు చక్కని అవగాహన కల్గిస్తునము.